![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ రివ్యూయర్ గా ఆదిరెడ్డి అందరికీ పరిచయమే. తర్వాత కామన్ మ్యాన్ క్యాటిగరీలో బిగ్ బాస్ సీజన్ 6 లో ఎంట్రీ ఇచ్చాడు. ఫైనల్ వరకు వెళ్లి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చాక ఒక సలోన్ స్టార్ట్ చేసాడు. మళ్ళీ బిగ్ బాస్ లేటెస్ట్ అప్ డేట్స్ ఇస్తూ ఉన్నాడు. అలాగే కొన్ని బుల్లితెర షోస్ కి భార్య కవితతో సహా వెళ్ళాడు. ఆదిరెడ్డి - కవిత జంటకు ఒక పాపా ఉంది. ఇప్పుడు మరో పాపకు జన్మనిచ్చింది కవిత.
ఆల్రెడీ ముందు వీరికి ఒక పాప ఉంది. ఆమె పేరు హద్విత. ఇక ఇప్పుడు కూడా మరో మహాలక్ష్మి పుట్టింది అంటూ డాక్టర్ తన చేతిలో బిడ్డను పెట్టిన వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. రీసెంట్ గా భార్య కవితకు ఘనంగా సీమంతం కూడా చేసాడు ఆదిరెడ్డి. ఇక నెటిజన్స్ ఐతే శ్రావణ మాసంలో పుట్టిన శ్రావణ మహాలక్ష్మి అంటూ కంగ్రాట్స్ చెప్తున్నారు. "మా అమ్మ మరణించిన రెండో రోజునే పాప పుట్టింది. దేవుడు ఇలా మా అమ్మను మరో సారి మా ఇంటికి పంపేలా ప్లాన్ చేసాడు" అంటూ స్టేటస్ లో పోస్ట్ చేసాడు. ఇక ఆదిరెడ్డి త్వరలో అడ్వకేట్ గా మారబోతున్నాడు. ఇక ఇష్మార్ట్ జోడి 3 రన్నరప్ గా నిలిచాడు ఆదిరెడ్డి.
![]() |
![]() |